📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రభుత్వ పురుషుల కళాశాల గ్రంథాలయంలో ఘనంగా ప్రత్యేక పుస్తక ప్రదర్శన

ప్రభుత్వ పురుషుల కళాశాల గ్రంథాలయంలో ఘనంగా ప్రత్యేక పుస్తక ప్రదర్శన

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ పురుషుల కళాశాల గ్రంథాలయంలో ఘనంగా ప్రత్యేక పుస్తక ప్రదర్శన

విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యం – ప్రిన్సిపల్ డాక్టర్ జె. వెంకటలక్ష్మి

గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పురుషుల కళాశాల గ్రంథాలయంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె. వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో పుస్తక పఠనం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. పుస్తకాలు మనిషికి విజ్ఞానాన్ని అందించడమే కాకుండా ఆలోచనా విధానాన్ని మెరుగుపరచి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలను చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ ప్రత్యేక పుస్తక ప్రదర్శనలో దేవాలయ నిర్మాణశైలి, చారిత్రక విశేషాలు, వర్ణచిత్రాలు, భాషా సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు తదితర అంశాలకు సంబంధించిన అనేక విలువైన పుస్తకాలను ప్రదర్శించారు. ఆయా పుస్తకాలను పరిశీలించిన ప్రిన్సిపల్ వాటి ప్రత్యేకతలు, విజ్ఞాన ప్రాధాన్యతను తెలుసుకున్నారు. వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా విద్యార్థులకు విస్తృతమైన విజ్ఞానాన్ని అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు.

గ్రంథాలయం అనేది కేవలం పుస్తకాలు చదివే ప్రదేశం మాత్రమే కాదని, విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన జ్ఞానాన్ని అందించే విజ్ఞాన కేంద్రం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయించడం ద్వారా సాధారణ జ్ఞానం, భాషా పరిజ్ఞానం, విషయ అవగాహన పెంపొందించుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటసుబ్బయ్య, గ్రంథాలయ ఇన్‌చార్జి డాక్టర్ ఎల్. రాజీవ్ బాబు, లైబ్రేరియన్ టి .శ్రీనివాసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక పుస్తక ప్రదర్శన విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు వివిధ రంగాలపై అవగాహన కల్పించేందుకు దోహదపడింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.