ప్రభుత్వ పురుషుల కళాశాల గ్రంథాలయంలో ఘనంగా ప్రత్యేక పుస్తక ప్రదర్శన
ప్రభుత్వ పురుషుల కళాశాల గ్రంథాలయంలో ఘనంగా ప్రత్యేక పుస్తక ప్రదర్శన విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యం – ప్రిన్సిపల్ డాక్టర్ జె. వెంకటలక్ష్మి గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పురుషుల కళాశాల గ్రంథాలయంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె. వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో పుస్తక పఠనం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు....