5వ వార్డులో చేయూత పింఛన్ పట్టాల పంపిణీ చేసిన కౌన్సిలర్ మిద్దెపాక భాస్కర్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పింఛన్ల పథకంలో భాగంగా, నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు మంగళవారం పింఛన్ పట్టాలను అందచేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జనగాం మున్సిపాలిటీ 5వ వార్డుకు చెందిన నూతన లబ్ధిదారులకు, వార్డు కౌన్సిలర్ మిద్దెపాక భాస్కర్ చేతుల మీదుగా పింఛన్ పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ భాస్కర్ మాట్లాడుతూ, పేదలు, వృద్ధులు, వితంతువులు మరియు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ పింఛన్లు అందించడానికి కట్టుబడి ఉందని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.
పింఛన్ పట్టాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి మరియు కౌన్సిలర్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, లబ్ధిదారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.


