దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే..
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 17:
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా గ్రంథాలయ సంస్థ పెద్దపల్లి ఆధ్వర్యంలో నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ పెద్దపల్లి చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ పోటీల్లో “దేశ అభివృద్ధిలో యువత పాత్ర” అనే అంశంపై విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచనలను వ్యాసాల రూపంలో వ్యక్తపరిచారు.
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు రచనా నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనా శక్తిని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పెద్దపల్లి సీఆర్పీ బాలసాని వెంకటేష్, సుందరగిరి శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు యునుస్ ఖాద్రి, గ్రంథపాలకురాలు బి. కవిత, ఎం. భారతీ, గ్రంథాలయ సిబ్బంది సీహెచ్. స్వరూప, ఎం.డి. షేర్ ఖాన్, జి. సదానందం తదితరులు పాల్గొన్నారు.

