పెద్దపల్లి అయ్యప్ప ఆలయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక దర్శనం
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి: నవంబర్ 17
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అయ్యప్ప స్వామికి భక్తిశ్రద్ధలతో మొక్కులు సమర్పించి దర్శనం చేసుకున్నారు.
అయ్యప్ప స్వామి ఆలయానికి విచ్చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్వామివారి ఆశీస్సులు పొందారు. అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు గడిపారు.
ఎంపీ ఆలయాన్ని సందర్శించడంతో స్థానికంగా ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. అయ్యప్ప స్వామి భక్తులు, ఆలయ పరిసరాల్లోని స్థానికులు ఎంపీ పర్యటనను ఆసక్తిగా గమనించారు.ఈ కార్యక్రమములో అయ్యప్ప భక్తులు బొంకురి సన్నీ కొమురయ్య బండారి సునీల్
బొంకురి బాబ్జి తదితరులు పాల్గొన్నారు

