📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగిరిజన బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకాలు

గిరిజన బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకాలు

📰 Generate e-Paper Clip

గిరిజన బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకాలు!

* చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

* 14 – 15 ఏళ్ల లోపు విద్యార్థినులకు క్యాన్సర్ నిరోధక టీకాలపై అవగాహన

* తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం

వెంకటాపురం (నూగురు), నవంబరు 17 (ప్రజావాణి): గిరిజన విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ గోపాలరావు, జిల్లా ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగ అన్వేష్ ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెంకటాపురం చిరుతపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక హెచ్‌పీవీ (క్యాన్సర్ నిరోధక) టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు.
పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ..
ఈ సందర్భంగా ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) లెనిన్ వత్సల్ టోప్పో చిరుతపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పాఠశాల పరిసరాలు, వసతులను పరిశీలించారు. అనంతరం ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రుల సమక్షంలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
టీకా ప్రయోజనాలపై అవగాహన..
14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు వయసున్న బాలికలకు ఈ క్యాన్సర్ నిరోధక టీకా వేయించడం ఎంత అవసరమో వైద్య సిబ్బంది తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థినులకు వివరంగా తెలియజేశారు. టీకా వల్ల కలిగే ప్రయోజనాలపై పూర్తి అవగాహన కల్పించిన అనంతరం అర్హులైన విద్యార్థినులకు టీకాలు వేశారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమల నాయక్, వార్డెన్ ఎట్టి బాబురావు, నాగరాజు, ఆనంద్ రావు, ఉపాధ్యాయురాలు పద్మ, హెచ్‌ఈఓ కోటిరెడ్డి, ఏఎన్‌ఎంలు వినోద, సుశీల, సరస్వతి, ఆశా కార్యకర్తలు మంగవేణి, మంగ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.