*తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం మేడ్చల్ మండల నూతన కమిటీ ఏర్పాటు
*
*కళాకారుల ఐక్యతే సంఘం బలోపేతానికి పునాది – జిల్లా అధ్యక్షుడు రాచర్ల శేఖర్*
మేడ్చల్, నవంబర్ 17: తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ మండల కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు రాచర్ల శేఖర్ హాజరయ్యారు. ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేడ్చల్ మండల నూతన కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు.
ఈ సందర్భంగా రాచర్ల శేఖర్ మాట్లాడుతూ బ్యాండ్ వాయిద్య కళాకారులందరూ ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘం ఒక వేదికగా నిలవాలని, కళాకారుల ఐక్యతతోనే వారి హక్కులను కాపాడుకోవడంతో పాటు సంక్షేమానికి కృషి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. మండల స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ కళాకారులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం మేడ్చల్ మండల నూతన కమిటీని ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా ఒగ్గు శేఖర్ (పిరాణి), ఉపాధ్యక్షుడిగా చిన్ని కృష్ణ, కార్యదర్శిగా బాలు యాదవ్, సహాయ కార్యదర్శిగా ముక్కెర శ్రీశైలం, గౌరవ సలహాదారుడిగా గాల్ల మల్లేష్ (పిరాణి), సహాయ సలహాదారుడిగా యటాల కుమార్, కోశాధికారిగా బుద్ధుల హరిచరణ్, సమాచార కార్యదర్శిగా గడ్డం శ్రావణ్ కుమార్ నియమితులయ్యారు. అలాగే గడ్డం ప్రదీప్, దిండిగల్ శివ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు రాచర్ల శేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి, బ్యాండ్ వాయిద్య కళాకారుల ఐక్యతకు, వారి సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. మండలంలోని కళాకారులందరినీ సంఘంలో భాగస్వాములను చేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కమిటీ సభ్యులుగా డి.సందీప్, కే. బబ్లూ, జి. నాగరాజు, ఆర్. మురళీ, వై. రాజు, డి.విష్ణు, ఎ.రమేష్, వై.ధర్మ, పి.రమేష్, జి.కృష్ణ ఎన్నికయ్యారు.

