📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఐదు రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలి

ఐదు రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

ఐదు రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలి

– షాబాద్‌ను రాష్ట్రంలోనే తొలి 100 శాతం అక్షరాస్య మండలంగా తీర్చిదిద్దాలి

– అధికారులకు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశాలు

ప్రజావాణి న్యూస్ //
షాబాద్, నవంబర్ 17

షాబాద్ మండలాన్ని రాష్ట్రంలోనే తొలి 100 శాతం అక్షరాస్య మండలంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. ఉల్లాస్ – నవభారత్ సాక్షరతా కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటింటి సర్వేను ఐదు రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
SEEEPC సర్వే ప్రకారం షాబాద్ మండలంలోని 41 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 15,507 కుటుంబాలు ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ కుటుంబాలను అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, SERP VOAs, VB-G RAM G సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు సమానంగా కేటాయించి ప్రతి ఇంటిని సందర్శించాలని సూచించారు. 15 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులందరినీ గుర్తించి వారి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా 15 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరక్షరాస్యుల వివరాలను ఉల్లాస్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ సర్వేకు MPDO మండల స్థాయి సమగ్ర పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాలని, MRO, MEO, CDPO, APM-SERP, APO-MGNREGS అధికారులు తమ పరిధిలోని సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.
సర్వే పూర్తయిన వెంటనే గ్రామాల్లో అక్షర కేంద్రాలను ఏర్పాటు చేసి వాలంటీర్లు, కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (CSR) సహకారంతో నిరక్షరాస్యులకు బోధనా కార్యక్రమాలు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరికీ చదవడం, రాయడం నేర్పించడమే లక్ష్యంగా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి షాబాద్ మండలాన్ని 100 శాతం అక్షరాస్య మండలంగా నిలపాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వేకు అవసరమైన ప్రొఫార్మా, శిక్షణ, సాంకేతిక సహకారాన్ని జిల్లా వయోజన విద్యా ఉప సంచాలకురాలు కె. అనిత అందిస్తారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.