📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగ్రామస్థాయిలో బీజేపీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ

గ్రామస్థాయిలో బీజేపీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ

📰 Generate e-Paper Clip

గ్రామస్థాయిలో బీజేపీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ

మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో గ్రామాల్లో పర్యటన

గ్రామీణ సమస్యలపై ఆరా.. కార్యకర్తలతో సమావేశం

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి: నవంబర్ 17

పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాజీ శాసనసభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జుల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో మంగళవారం పెద్దపల్లి మండలంలోని చీకురాయి, భోజన్నపేట, హనుమంతునిపేట, మారెడుగొండ, గుర్రాంపల్లి గ్రామాల్లో బీజేపీ నాయకులు పర్యటించారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక నాయకులు, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున పోరాటం చేయాల్సిన అవసరాన్ని నాయకులు వివరించారు.

రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామస్థాయిలో పార్టీకి బలమైన పునాది వేసేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పర్ష సమ్మయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం, జంగా చక్రధర్ రెడ్డి, సిలువేరు ఓదెలు, భూసనవేన శ్రీనివాస్ గౌడ్, పెంచాల సంతోష్, మొడ్డెద్దుల జగన్, ముత్యాల మహేందర్, కీర్తి సాగర్, మేకల రమేష్, బాలసాని దిలీప్, బాలసాని వంశీ, రేకుంట్ల సాగర్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.