*కాసీపేట 1 గనిని సందర్శించిన ఆసిఫాబాద్ డిఎఫ్ఓ*
* *మన ప్రజావాణి* *మందమర్రి:-*
సింగరేణి ఏరియాలోని కాసీపేట 1 గనిని సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారిని (డిఎఫ్ఓ) సిహెచ్ బాలమణి సందర్శించారు. ఈసందర్భంగా ఆమెకు గని మేనేజర్ సతీష్, అధికారులు ఘన స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సన్మానించారు. గనిలో ఉన్న పర్యావరణాన్ని సందర్శించి, ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ, గని పరిసరాలు పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చూపరులను ఆకర్షించే వన్యప్రాణుల చిత్రాలు బాగున్నాయని అభినందించారు. ఉద్యోగుల లతో మాట్లాడి వారి బాగోగులను,పని విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గని పని స్థలాలు పరిశీలించి, ఉద్యోగుల పని విధానాన్ని,బొగ్గు ఉత్పత్తి ని,యంత్రాల పనితీరును పర్యవేక్షించారు. ఈసందర్భంగా డిఎఫ్ఓ బాలమణి మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగులు కష్ట పడి పనిచేసే వారని,చీకట్లను తొలగించి దేశానికి వెలుగులు పంచేవారని,అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయగల నేర్పరులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సతీష్,గని రక్షణాధికారి సురేష్,సర్వేయర్ రవీందర్,సంక్షేమాధికారి మీర్జా గౌస్ జీషాన్ లు పాల్గొన్నారు.

