📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఆరుట్ల గ్రామంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర ఏర్పాట్లపై గ్రామసభ

ఆరుట్ల గ్రామంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర ఏర్పాట్లపై గ్రామసభ

📰 Generate e-Paper Clip

*ఆరుట్ల గ్రామంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర ఏర్పాట్లపై గ్రామసభ*

*వాహ నాల*
*పార్కింగ్ వేలం2 లక్షల15* *వేలకు గుడ్డిమల్ల శ్రీనివాస్* *ముదిరాజ్*

*-పార్టీలకు అతీతంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి గ్రామసర్పంచ్ మాని పార్టీ శోభాకుమార్ ఉపసర్పంచ్ నూకం రాజుముదిరాజ్*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నంబర్ 16 (ప్రజావాణి ):మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఈనెల 24వ తేదీ నుండి ప్రారంభమయ్యే బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై ఆరుట్ల గ్రామసర్పంచ్ మానిపాటి శోభ కుమార్ ఉపసర్పంచ్ నూకంరాజు ముదిరాజ్ పాలకమండలి గ్రామ కార్యదర్శి చిలుకల వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు వివిధ పార్టీల నాయకులు గత ఏడాది బుగ్గ జాతర సందర్భంగా వచ్చిన విరాళాల డబ్బుల గురించి సక్రమంగా లెక్కలు చూపించాలి అని ఎండోమెంట్ అధికారులను ఎండోమెంట్ కమిటీ సభ్యులను నిలదీశారు గ్రామ పెద్దలకు గ్రామ స్తులకు ఎవర్ని సంప్రదించకుండా ఎండోమెంట్ కమిటీ ఏర్పాటుపై మండిపడ్డారు గ్రామ సర్పంచ్ కు కూడా తెలియకుండా కమిటీ వేయడం సరైన పద్ధతి కాదని కావాలని కొంతమంది రాజకీ యాలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదు అని గ్రామస్తులు గ్రామసభలో ఆందోళన చేశారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు కొండిగారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ఎండోమెంట్ కమిటీ ఏర్పాటు వల్ల దేవాలయానికి ఎలాంటి లాభం లేకుండా ఖర్చులే ఎక్కువగా అయ్యాయి అని అన్నారు ఎండోమెంట్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం కనీసం బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం కోటి
రూపాయలు మంజూరు చేసి దేవాలయం అభివృద్ధి చేయాలి కానీ బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు వచ్చిన విరాళాల డబ్బులతోనే వివిధ అవసరాలకు ఖర్చులు పెట్టడం సరైన పద్ధతి కాదు అని అన్నారు ఎండోమెంట్ కమిటీ ఏర్పాటు అయ్యింది అంటే బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు దేవుడికి దీపదూప నైవేద్యాలు పెట్టి పూజలు చేయాలి అన్నారు ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు పున్నం రాము మాట్లా డుతూ నిజంగా బుగ్గ రా మలింగేశ్వరస్వామి ఎండోమెంట్ కమిటీ ఏర్పాటు చేశారా లేక తాత్కాలికంగా కమిటీ వేశారా ని జంగా కమిటీ వేస్తే పత్రాల పైన ఎండోమెంట్ స్టాంపు సంతకం ఏది అని ఎండోమెంట్ అధికారు లను నిలదీశారు దీనికి ఎండోమెంట్ అధికారులు సరైన సమాధానం చెప్పలేదు ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ మానిపాటి శోభాకుమార్ ఉపసర్పంచ్ నూకంరాజు ముదిరాజ్ మాట్లాడుతూ బు గ్గ రామలింగేశ్వరస్వామి జాతర ఉత్సవాల ఏర్పాట్లపై రాజకీయాలకు అతీతంగా అందరంకలిసి సమన్వయంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని అన్నారు అనంతరం బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర వద్ద వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు వేలం పాట నిర్వహించారు వేలంపాటలో ఆరుట్ల గ్రామానికి చెందిన గుడ్డిమల్ల శ్రీనివాస్ ముది రాజ్ 2 లక్షల15 వేలకు పార్కింగ్ టెండర్ దక్కించుకున్నాడు ఈకార్యక్రమంలో ఎండోమెంట్ అ ధికారులు ఎండోమెంట్ కమిటీ సభ్యులు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు గ్రామస్తులు వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.