*కంకణాల నవీన్ జ్ఞాపకార్థం చిన్నారులకు స్టీల్ ప్లేట్ల పంపిణీ*
* *మన ప్రజావాణి మందమర్రి:-*
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివంగత కంకణాల నవీన్ జ్ఞాపకార్థం పట్టణంలోని చిన్నారులకు సోమవారం స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ మాట్లాడుతూ, కంకణాల నవీన్ మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. చిన్నారులు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను ఉపయోగించడం వల్ల ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించవచ్చుననే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఎవరైనా తమ కుటుంబ సభ్యుల పెళ్లిరోజు, పుట్టినరోజు లేదా ఇతర ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించాలని కోరారు. వారి సహకారంతో నిరుపేదలకు, చిన్నారులకు సేవా కార్యక్రమాలతో సహాయం అందిస్తామని తెలిపారు. కంకణాల నవీన్ జ్ఞాపకాలు ఎప్పటికీ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా అధ్యక్షుడు నందిపాటి రాజ్ కుమార్, సభ్యులు పృథ్వీ, వేముల రమేష్ లు పాల్గొన్నారు.

