📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి –
BLR

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 16

రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే.. రైతులతో నేరుగా మాట్లాడి వడ్ల ధరల వివరాలు సేకరణ
మిర్యాలగూడ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR సూచించారు.
ఈరోజు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు *గౌరు శ్రీనివాస్ తో* కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR పలు రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు…
ఈ సందర్భంగా రైస్ మిల్లుల యాజమాన్యాలతో మాట్లాడి రైతుల నుంచి ధాన్యాన్ని క్వింటాలుకు రూ.3,500 తగ్గకుండా కొనుగోలు చేయాలని సూచించారు..
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, ధాన్యం విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
అనంతరం మిల్లుల వద్ద ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి ప్రస్తుతం ధాన్యానికి లభిస్తున్న ధరలు, కొనుగోలు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ..
పలు రైస్ మిల్లుల్లో బిల్లులను సైతం పరిశీలించి కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను తనిఖీ చేశారు…
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు పండించిన ధాన్యానికి తగిన ధర లభించేలా నిరంతరం పర్యవేక్షిస్తామని ఎమ్మెల్యే BLR తెలిపారు….

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.