📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపాలకుర్తి నియోజకవర్గంలో 2,354 మందికి నూతన చేయూత పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గంలో 2,354 మందికి నూతన చేయూత పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

📰 Generate e-Paper Clip

*పాలకుర్తి నియోజకవర్గంలో 2,354 మందికి నూతన చేయూత పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి*

పాలకుర్తి, నవంబర్ 16: పాలకుర్తి నియోజకవర్గంలోని అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన చేయూత పెన్షన్లను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు చెందిన నూతన పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు ఎంతో ఆసరాగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, పేదల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి మండలానికి 1,114, దేవరుప్పుల మండలానికి 732, కొడకండ్ల మండలానికి 508 చొప్పున మొత్తం మూడు మండలాలకు 2,354 నూతన చేయూత పెన్షన్లు మంజూరయ్యాయి.

నూతనంగా పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి, ప్రజా ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.