*ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన… పారదర్శక విచారణకు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు*
*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*
ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించిన పోలీస్ కమిషనర్, సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యత ఇవ్వాలని,ఎలాంటి జాప్యం, అలసత్వానికి తావులేకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన)
కె.శ్రీనివాస్ పాల్గొన్నారు..

