📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్విదేశీయుల జోక్యాన్ని ప్రోత్సహించడం దేశ గౌరవానికి తగదు బీజేపీ నాయకురాలు కృష్ణ ప్రియ

విదేశీయుల జోక్యాన్ని ప్రోత్సహించడం దేశ గౌరవానికి తగదు బీజేపీ నాయకురాలు కృష్ణ ప్రియ

📰 Generate e-Paper Clip

భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విదేశీయులు మన దేశంలోనే విమర్శలు చేయడం, అంతర్గత రాజకీయ అంశాలపై వ్యాఖ్యానించడం అత్యంత అభ్యంతరకరమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, దేశ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో విదేశీయులను భాగస్వాములను చేయడం ఎంతవరకు సమంజసమో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక విదేశీయుడు భారత ప్రధానిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు స్పందించిన తీరు దేశభక్తి కలిగిన ప్రతి భారతీయుడిని ఆలోచింపజేస్తోందని పేర్కొన్నారు. దేశ రాజకీయాలపై విమర్శలు చేయాల్సి వస్తే భారతీయులే ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోవచ్చని, విదేశీయుల జోక్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదని అన్నారు. స్వాతంత్ర్యానికి ముందు విదేశీ పాలకుల కారణంగా దేశం ఎన్నో కష్టాలు ఎదుర్కొందని, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి సంబంధించిన అంశాల్లో రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, దేశ గౌరవం విషయంలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ఠ పెరుగుతోందని పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం జరుగుతున్న కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఘటనను గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇది కేవలం ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా నాయకుడికి సంబంధించిన అంశం కాదని, దేశ గౌరవం మరియు భారతదేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన విషయమని తెలిపారు. రాజకీయంగా ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమనే భావనతో దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ దేశ గౌరవాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.