విదేశీయుల జోక్యాన్ని ప్రోత్సహించడం దేశ గౌరవానికి తగదు బీజేపీ నాయకురాలు కృష్ణ ప్రియ

భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విదేశీయులు మన దేశంలోనే విమర్శలు చేయడం, అంతర్గత రాజకీయ అంశాలపై వ్యాఖ్యానించడం అత్యంత అభ్యంతరకరమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, దేశ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో విదేశీయులను భాగస్వాములను చేయడం ఎంతవరకు సమంజసమో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక విదేశీయుడు భారత ప్రధానిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్...