**విజ్ఞానం..వివేకం.. వికాసమే లక్ష్యం! వేలేరు MSF నూతన మండల కమిటీ ఎన్నిక**
హనుమకొండ జిల్లా, వేలేరు మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం సమీపంలో 15-11-2026న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) మండల సదస్సు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి MSP మండల అధ్యక్షులు రామాంచ యేసు మాదిగ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా MRPS హనుమకొండ జిల్లా కో-ఇంచార్జ్ తడుగుల విజయ్ కుమార్ మాదిగ, మండల ఇంచార్జ్ బొడ్డు శాంతి సాగర్ మాదిగ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. SC వర్గీకరణ ద్వారా లభిస్తున్న రిజర్వేషన్లను మాదిగ విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విద్య, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. మాదిగ విద్యార్థుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం MSF నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
అనంతరం MSF వేలేరు మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఏలా ప్రకాష్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా మేక రవితేజ మాదిగ, అధికార ప్రతినిధిగా తాండూరి సాయి తేజ మాదిగలను నియమించారు. అలాగే ఇతర కార్యవర్గ సభ్యులను ప్రకటించారు.

