📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా జరిగిన వివాహ మహోత్సవం.. నూతన వధూవరులను ఆశీర్వదించిన బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అదనపు సమన్వయకర్త...

ఘనంగా జరిగిన వివాహ మహోత్సవం.. నూతన వధూవరులను ఆశీర్వదించిన బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి

📰 Generate e-Paper Clip

కలసపాడు బద్వేల్ నవంబర్ 15ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కలసపాడు మండలం, పిడుగుపల్లి గ్రామ వాస్తవ్యులు, ప్రముఖులు శ్రీ నాగిరెడ్డి ఈశ్వర్ రెడ్డి, శ్రీమతి జయప్రద దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి మల్లికార్జున రెడ్డి, మరియు చాపాడు మండలం, నరహరిపురం గ్రామ వాస్తవ్యులు శ్రీ పాలెంపల్లి రామకృష్ణారెడ్డి, కీర్తిశేషులు శ్రీమతి స్వర్ణలత దంపతుల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీవిజితల వివాహ మహోత్సవం వేదమంత్రాల సాక్షిగా, అత్యంత వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామస్తుల కోలాహలం మధ్య ఈ శుభకార్యం కన్నుల పండువగా సాగింది.ఈ పవిత్ర వివాహ వేడుకకు బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి,ప్రత్యేక ఆహ్వానితులుగా,ముఖ్య అతిథిగా విచ్చేశారు.వివాహ వేదిక వద్దకు విచ్చేసిన శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి కి పెళ్లి కుమారుడు,పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు,గ్రామ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేదికపైకి చేరుకున్న శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి నూతన వధూవరులు చి.మల్లికార్జున రెడ్డి,చి.ల.సౌ. శ్రీవిజితలకు పుష్పగుచ్ఛం అందజేసి,మంగళాక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.వివాహ బంధం ఎంతో పవిత్రమైనదని, నూతన దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఇరు కుటుంబాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. భగవంతుని ఆశీస్సులతో ఈ నూతన జంట నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలతో కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ వివాహ మహోత్సవంలో బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కలసపాడు మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పిడుగుపల్లి మరియు నరహరిపురం గ్రామాల పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు…

..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.