📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకార్తీక మాసం సందర్భంగా శ్రీ పశుపతినాథుడికి ప్రత్యేక రుద్రాభిషేకం

కార్తీక మాసం సందర్భంగా శ్రీ పశుపతినాథుడికి ప్రత్యేక రుద్రాభిషేకం

📰 Generate e-Paper Clip

కార్తీక మాసం సందర్భంగా శ్రీ పశుపతినాథుడికి ప్రత్యేక రుద్రాభిషేకం

స్వామివారి అనుగ్రహంతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి – హింగే భాస్కర్

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వల్లభాపురంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఆలయ అర్చకులు శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత సహిత ప్రత్యేక రుద్రాభిషేకం,వివిధ అభిషేకాలు,అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో రైతు రక్షణ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో శివుడికి పంచామృత సహిత రుద్రాభిషేకం నిర్వహించుకోవడం ఎంతో విశేషమైనదని, ఇది భక్తులకు లభించిన అదృష్టమని పేర్కొన్నారు. శ్రీ పశుపతినాథ స్వామివారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ప్రస్తుత కాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు పాడిపంటలు బాగా పండాలని, రైతన్నల కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి, భక్తులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.