గోకినేపల్లి ఎస్సీ కాలనీలో రూ.43,25 లక్షలతో సీసీ రోడ్లు
రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
ముదిగొండ నవంబర్ 14 ప్రజావాణి
ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రజల చిరకాల కోరిక నెరవేరే దిశగా ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.43,25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఈ రోడ్డు నిర్మాణంతో కాలనీలో రాకపోకల ఇబ్బందులు తొలగి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందనుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ఎంతో అవసరమని, ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణంతో కాలనీలో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మినేని రమేష్ బాబు, గ్రామ సర్పంచ్ పెరంపల్లి శ్రీను, ఉపసర్పంచ్ మీగడ శ్రీను, ఎస్టీ సెల్ బాబు నాయక్, జిల్లా నాయకులు మీగడ శ్రీనివాసరావు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, పొనం రమేష్, మీగడ బాబు, బొప్పి వంశీ, గుంజులూరి గంగాధర్, గౌతమ్, తోట మల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.


