బాలల దినోత్సవ వేడుకలు – ప్రత్యేక బాల గ్రామసభ
గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ ఆధ్వర్యంలో..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 14
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని డోన్గావ్ గ్రామ పంచాయతీ ఆవరణలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక బాల గ్రామసభ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిన్నారులతో కలిసి బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొని, వారి సమస్యలు, అవసరాలు మరియు అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
పిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యం మరియు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ తెలియజేయడం జరిగింది. సర్పంచ్ చేతుల మీదుగా
అనంతరం చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు మరియు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ మాట్లాడుతూ…
నేటి బాలలే రేపటి భారత పౌరులు. వారి అభివృద్ధే మన గ్రామ అభివృద్ధి!
బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు!
సర్పంచ్
ఖానాపురే శ్రీనివాస్ తెలియజేశారు..


