📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనెహ్రూ నాటిన అభివృద్ధి విత్తనాలే నేడు మహావృక్షాలు: జగ్గారెడ్డి

నెహ్రూ నాటిన అభివృద్ధి విత్తనాలే నేడు మహావృక్షాలు: జగ్గారెడ్డి

📰 Generate e-Paper Clip

నెహ్రూ నాటిన అభివృద్ధి విత్తనాలే నేడు మహావృక్షాలు: జగ్గారెడ్డి

• సంగారెడ్డిలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

మన ప్రజావాణి | నవంబర్ 14 | సంగారెడ్డి | జిల్లా ప్రతినిధి

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం తొలి ప్రధానిగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దేశ నిర్మాణానికి బలమైన పునాదులు వేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఐబీ జంక్షన్ వద్ద నెహ్రూ విగ్రహానికి జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం, పరిశ్రమలు, విద్యారంగాల అభివృద్ధికి నెహ్రూ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దేశంలో ఎన్నికల ప్రక్రియ, శాసన, న్యాయ వ్యవస్థల పటిష్టతకు కృషి చేశారని తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కూడా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో ఓడీఎఫ్, బీఈఎల్, బీడీఎల్ వంటి పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మందికి ఉపాధి లభించిందన్నారు. సింగూరు, మంజీర ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్నాయని చెప్పారు. నాడు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ నాటిన అభివృద్ధి విత్తనాలే నేడు మహావృక్షాలుగా మారి ప్రజలకు నీడను, ఫలాలను అందిస్తున్నాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. నెహ్రూ–గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలు, త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.