బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.. డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 14
మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లోని *మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో* నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు…
విద్యార్థినులకు చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
అనంతరం స్పోర్ట్స్ మీట్లో భాగంగా విద్యార్థినులతో కలిసి వివిధ ఆటల్లో పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR విద్యార్థినులను అభినందిస్తూ, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థినులు తమలోని ప్రతిభను వెలికితీసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ , కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.


