భారత నవ నిర్మాణానికి నేటి బాలలే మార్గదర్శకులు
గ్రామ సర్పంచ్,సర్పంచుల ఫోరం అద్యక్షులు సత్యనారాయణ
బాలల పరిరక్షణ ఆరోగ్యం, పోషణపై అవగాహన
మద్దూరు నవంబర్14, ప్రజా వాణి,
మండలంలోని నర్సాయపల్లి గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు,సర్పంచ్ శనిగరం.సత్యనారాయణ ఆధ్వర్యంలో…. బాలల దినోత్సవం సందర్భంగా బాల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా విద్య మరియు పాఠశాల భాగస్వామ్యం,బాల్య వివాహాల నిర్ములాన,బాల కార్మిక నిర్ములాన,హింస మరియు బాలల పరిరక్షణ,ఆరోగ్యం,పోషణ,నీరు,పారిశుధ్యం మరియు పరిశుభ్రత,బహిరంగ ప్రదేశాల్లో భద్రత వంటి అంశాలపై బాలలకు అవగాహన కల్పించారు.అదే విధంగా
బాలలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు.ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి.భాస్కర్,హై స్కూల్ టీచర్ నర్సింహులు,అంగన్వాడీ టీచర్లు ఎం.శ్రీమతి,ఎం. బాలమణి,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పి.నవనిత మరియు రిలయన్స్ ఫౌండేషన్ సి ఆర్ పి భార్గవి,గ్రామ ప్రజలు,సిబ్బంది పాల్గొన్నారు.


