*సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ముందుంటుంది…*
*ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 13*
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పెన్షన్ల పత్రాలను అర్హులైన గ్రామంలోని ప్రతి లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య జిల్లా గ్రామీణ శాఖ అధికారి నాగిరెడ్డి లతో కలిసి లబ్ధి దారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. నేటి సమాజం లోని నీరు పేదలు , వృద్ధులు , వితంతువులు, దివ్యాంగులు , ఇతర అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పేద కుటుంబాలకు ఆసరా పెన్షన్లు ఎంతగానో ఉప యోగకరంగా ఉంటాయని, ప్రతి నెలా అందే పెన్షన్‌తో వారి నిత్యావసర అవ సరాలకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు.
గతంలో ఇచ్చిన హామీ లను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆలేరు నియో జకవర్గంలోని అన్ని మండలాలు అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని , అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా తన వంతు బాధ్యతగా పనిచేస్తానని , నేను నాయకుడిని కాదు.. మీ సేవకుడని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు.


