📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం, పేదవారి సొంతింటి స్వప్నం సాకాకరమైన వేళ.... ...

ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం, పేదవారి సొంతింటి స్వప్నం సాకాకరమైన వేళ…. పేదళ సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం

📰 Generate e-Paper Clip

*ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం, పేదవారి సొంతింటి స్వప్నం సాకాకరమైన వేళ…. పేదళ సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం*

*గ్రామాల్లో అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏజండా*

*కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి*

*కొందుర్గ్ పరిధిలోని ఉత్తరస్పల్లి గ్రామం లో దొడ్వల్లి పావని శేఖర్ ఇందిరమ్మఇళ్ల ప్రారంభోత్సవం..*

కొందుర్గ్ శుక్రవారం 13(మన ప్రజా వాని)

కొందుర్గ్ మండలోని ఉత్తరస్పల్లి గ్రామం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన వారి గృహ ప్రవేశ కార్యక్రమం చాలా ఆర్భాటంగా జరిగింది
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామంలో నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులైన దొడ్వల్లి పావని శేఖర్ దంపతులు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవం ఘనంగా నిర్వహించటం జరిగింది
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కొందుర్గ్ మండల అధ్యక్షులు కొగురి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మరి అలాగే గ్రామాలలో నిరుపేదలైన ఇల్లు లేని ప్రతిఒక్కరికి రాజకీయ పార్టీలకు అతీతంగా ఇళ్లు మంజూరి చేస్తుంది మన ప్రజా ప్రభుత్వం అని ఆయన అన్నారు అనంతరం నూతన గృహంలో పూజా కార్యక్రమo నిర్వహించి, లబ్ధిదారులైన దొడ్వల్లి పావని శేఖర్ దంపతులకు శాలువాతో సత్కరించారు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి గోవర్ధన్ గౌడ్,మాజీ ఎంపీటీసి లు అంజిరెడ్డి,మల్లేష్ గౌడ్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రామరాజు ,సీనియర్ నాయకులు,పొట్టశివకుమార్ ,వార్డ్ సభ్యులు కమ్మరి రాజు ,మల్లేష్,గణేష్ , రవి ,మహిళలు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.