📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసుభాష్ నాయక్ తండాలో అంగన్వాడీ భవనానికి భూమిపూజ

సుభాష్ నాయక్ తండాలో అంగన్వాడీ భవనానికి భూమిపూజ

📰 Generate e-Paper Clip

*సుభాష్ నాయక్ తండాలో అంగన్వాడీ భవనానికి భూమిపూజ*

*సర్పంచ్ వందనా బిక్కులాల్ చేతుల మీదుగా పనులకు శ్రీకారం.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 12:–
నిర్మల్ జిల్లా కుబేర్ మండలం రామ్ నాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని సుభాష్ నాయక్ తండాలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వందనా బిక్కులాల్ భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయితే తండా పరిధిలోని చిన్నారులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రాజశేఖర్, మాజీ జడ్పీటీసీ ఆల్కత్తాయి సంజయ్, ఉపసర్పంచ్ సుభాష్ ఉదల్, మాజీ సర్పంచ్ బద్దు మోహన్, సురేష్, యశ్వంత్, సురేష్, అవినాష్, ఈశ్వర్, సచిన్, భీమ్, పింటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.