📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమూడు గ్రామాలలో విసిపిసి కమిటీలు..

మూడు గ్రామాలలో విసిపిసి కమిటీలు..

📰 Generate e-Paper Clip

మూడు గ్రామాలలో విసిపిసి కమిటీలు..

ప్రజావాణి,నెల్లికుదురు: బాలల భద్రత కోసం గ్రామస్థాయిలో ఐసిడిఎస్ అంగన్వాడి నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ ఎన్.సరిత ఆధ్వర్యంలో
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి,వస్రాం తండా, మదనతుర్తి గ్రామాలలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (విసిపిసి) లను బుధవారం ఎన్నుకున్నారు.

బాలల భద్రతకు కమిటీలు: సర్పంచి

బ్రాహ్మణ కొత్తపల్లి యుపిఎస్ లో జరిగిన కార్యక్రమంలో సర్పంచి డా.చిర్ర యాకాంతం గౌడ్ పాల్గొని మాట్లాడుతూ బాలల భద్రత కోసం కమిటీలు కృషి చేస్తాయన్నారు.బాలల అక్రమ రవాణా బాల్య వివాహాలు తదితర సమస్యలు ఉత్పన్నం కాకుండా విసిపిసిల నిఘా కొనసాగుతుందన్నారు. కాగా కమిటీ చైర్మన్ గా సర్పంచి డా.యాకాంతం గౌడ్,కన్వీనర్ గా అంగన్వాడీ టీచర్ శ్రీ జ్యోతి లతో కూడిన 15 మందితో కమిటీ ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎర్ర రవి, రెవిన్యూ అధికారి సందీప్ సూపర్వైజర్ ఎన్.సరిత, హెచ్ఎం వెంకటేష్, షేక్ అజీమ్ బొల్లు అశోక్, బొల్లు మురళీ కృష్ణ యాదవ్, అంగన్వాడీ టీచర్లు మాదగాని కవిత,దాసరి కవిత ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

వస్రాం తండా,మదన తుర్తిలలో..

వస్రాం తండా విసిపిసి కమిటీ చైర్మన్ గా స్థానిక సర్పంచి జి.కరుణ మధు తో పాటు 15 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు, మదనతుర్తి గ్రామ విసిపిసి కమిటీ చైర్మన్ గా సర్పంచి వడ్లకొండ రాధ ను ఎన్నుకోగా మరో 15 మందిని సభ్యులుగా నియమించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.