ఎర్రబెల్లి స్వర్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన వంగాల కళ్యాణి మల్లారెడ్డి
జిల్లాలో మహిళా కాంగ్రెస్ బలోపేతంపై చర్చ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ని కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వంగాల కళ్యాణి మల్లారెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో జనగామ జిల్లాలో మహిళా కాంగ్రెస్ సంస్థాగత బలోపేతం, మండల, గ్రామ స్థాయిల్లో మహిళా కమిటీల ఏర్పాటు, మహిళల సమస్యల పరిష్కారం, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా వంగాల కళ్యాణి మల్లారెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లాలో మహిళా కాంగ్రెస్ను ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమ పథకాలు ప్రతి అర్హురాలికి అందేలా చూడటం, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడటం, మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ మాట్లాడుతూ జనగామ జిల్లాలో మహిళా కాంగ్రెస్ కార్యక్రమాలు ప్రశంసనీయంగా ఉన్నాయని అభినందించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళల పక్షాన ఉంటుందని, మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లాలో మహిళా కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
జిల్లాలో మహిళలను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానించడం, మహిళా సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, మహిళా సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం వంటి అంశాలపై ఇరువురు కలిసి పనిచేయాలని నిర్ణయించారు.


