📄 ePaper
Epaper 2
Thursday, November 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగుగ్గిళ్ల 10వ వార్డులో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం

గుగ్గిళ్ల 10వ వార్డులో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం

📰 Generate e-Paper Clip

గుగ్గిళ్ల 10వ వార్డులో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం

గ్రామ అభివృద్ధికి పెద్దపీట.. మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

బెజ్జంకి, నవంబర్ 12 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలోని 10వ వార్డులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సుమారు రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు పాలకవర్గ సభ్యులు తెలిపారు.సీసీ రోడ్డు నిర్మాణంతో 10వ వార్డు ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగనున్నాయని పేర్కొన్నారు.గ్రామంలోని అన్ని వార్డుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుగ్యాని లావణ్య మోహన్, వార్డు సభ్యులు పోతు భూలక్ష్మి, సీత రేణుక, పంతంగి వెంకటేష్ గౌడ్, కొంకటి సంపత్, కొంకటి కుమార్, కొంకటి సురేష్, ర్యాకం అనిత, గుగ్గిళ్ల లావణ్య, దూశెట్టి రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వంశీ, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, కరాబార్ అశోక్, వీవోఏ భాగ్య, గుగ్గిళ్ల రాజేష్, విజయ్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.