📄 ePaper
Epaper 2
Thursday, November 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజనగామ జిల్లా లో అక్రమంగా నిల్వ ఉంచిన 546 బస్తాల వరి విత్తనాలు పట్టివేత.

జనగామ జిల్లా లో అక్రమంగా నిల్వ ఉంచిన 546 బస్తాల వరి విత్తనాలు పట్టివేత.

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా లో
అక్రమంగా నిల్వ ఉంచిన 546 బస్తాల వరి విత్తనాలు పట్టివేత.

రూ.7,41,743 విలువైన వరి విత్తనాలు స్వాధీనం – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10 (ప్రజావాణి):జనగామ జిల్లా చిల్పూర్ మండలం గార్లగడ్డ తండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 546 బస్తాల వరి విత్తనాలను వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల సంయుక్త మండల టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల విలువ రూ.7,41,743గా ఉందని వెల్లడించారు.

రబీ (యాసంగి) సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో రైతులకు నాణ్యమైన, ధృవీకరించబడిన విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విత్తనాల అక్రమ నిల్వలు, అనధికార విక్రయాలు మరియు నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో చిల్పూర్ మండలం గార్లగడ్డ తండాలో నిర్వహించిన తనిఖీల్లో గ్రామానికి చెందిన భూక్య రాజు ఇంటి వద్ద రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన 546 బస్తాల వరి విత్తనాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వీటిలో 1010, RNR-15048, KNM, BPT తదితర రకాల వరి విత్తనాలు ఉన్నాయని, ట్రూత్‌ఫుల్, ఫౌండేషన్ మరియు బ్రీడర్ సీడ్ విత్తనాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని తెలిపారు.
విత్తన చట్టం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలను నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విత్తన డీలర్లు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్సులు కలిగి ఉండాలని, విత్తనాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
ప్రతి విత్తన బస్తాపై ఉన్న రకం, బ్యాచ్ నంబర్, లేబుల్, నాణ్యత ప్రమాణాలు, గడువు తేదీని రైతులు పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని సూచించారు.
రైతులు అధీకృత విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి, తప్పనిసరిగా కొనుగోలు రశీదులు పొందాలని కోరారు.
జిల్లాలో నకిలీ, నాణ్యతలేని, అక్రమంగా నిల్వ చేసిన విత్తనాల విక్రయాలపై వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతర నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

యాసంగి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన విత్తనాల సరఫరాను నిర్ధారించడంతో పాటు, అక్రమ విత్తన వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ తనిఖీలలో మండల వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది మరియు మండల టాస్క్‌ఫోర్స్ బృంద సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.