కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్ కు పితృవియోగం..నివాళులర్పించిన ఎమ్మెల్యే
ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రత్తిరామ్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా నేత గుగులోతు బాలాజీ నాయక్ కు పితృవియోగం జరిగింది. సమాచారం సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ రత్తి రామ్ తండాకు చేరుకొని పార్థివ దేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలాజీ నాయక్ ను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ ఆపదశయన సమయంలో మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. అంతక మునుపు వివిధ గ్రామాల సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పార్థివ దేహానికి నివాళులర్పించారు.ఎమ్మెల్యే వెంట సర్పంచ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

