జుక్కల్ మండలం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్..
చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి.. ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి 08
దీపావళి పండుగను పురస్కరించుకుని జుక్కల్ మండల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సతీష్ పెటేల్ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పర్వదినాన్ని ప్రజలందరూ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు.
జుక్కల్ మండల ప్రజల ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, సమాజంలో ప్రేమాభిమానాలు, ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్ ఆకాంక్షించారు. ప్రతి ఇంటా దీపాల వెలుగులు విరజిమ్ముతూ, ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలు చిగురించాలని కోరుకుంటూ మరోసారి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్ కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్
జుక్కల్ మండల ప్రజలకు దీపావళి.శుభకాంక్షలు తెలిపారు..

