*చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి*
*ముధోల్ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి పండుగ శుభాకాంక్షలు*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, ముధోల్ నవంబర్ 7:-
దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి అనేది కేవలం దీపాల పండుగ మాత్రమే కాకుండా చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో మంచి ఆలోచనలు, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ పరస్పర సహకారం, సోదరభావంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

