ఆలేరులో ప్రకృతి సాగు పై రైతులకు అవగాహన
ప్రజావాణి,నెల్లికుదురు: ప్రకృతి సాగుపై వేసంగి(రబీ)లో రైతులు అనుసరించాల్సిన మెలకువలపై మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మండలంలోని ఆలేరు రైతు వేదికలో శనివారం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ సాగుకు ఎంపికైన మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన 125 మంది రైతులకు సహజ సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవో మహేందర్ వివరించారు. పెస్టిసైడ్స్,రసాయన ఎరువుల వినియోగం పూర్తిగా నిలిపివేసి ప్రకృతి సిద్ధమైన పశువుల పేడ,ఆవు మూత్రం,వేప గింజలు వంటి ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన పర్యావరణహితమైనవే వాడాలని సూచించారు. ఆర్గానిక్ వ్యవసాయంతో పండించిన పంటలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మణికంఠ, సిఆర్పిలు జాటోత్ రమేష్,శామకూరి సునీత, ఆర్గానిక్ సాగు రైతులు పాల్గొన్నారు.
ఆలేరులో ప్రకృతి సాగు పై రైతులకు అవగాహన
RELATED ARTICLES

