📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

*ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి అందుబాటులో ఉన్న కొద్ది నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలి – మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

ఎల్‌నినో ప్రభావం కారణంగా యాసంగి సీజన్‌లో వర్షపాతం తగ్గి, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ సూచించారు. శనివారం నాడు మండల పరిధిలోని కొండాపురం, నెర్మట గ్రామాలలో ఎల్ నినో నేపథ్యంలో ప్రజలకు అవగాహన పైన నిర్వహించిన ప్రత్యేక సభలకు హాజరయ్యి ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. భూగర్భ జలాలు తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నీటి లభ్యత ఆధారంగానే పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా శనగ, జొన్న , పెసర, మొక్కజొన్న మినుము, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. రైతులు తమ భూముల స్వభావం, నేలలో తేమ, అందుబాటులో ఉన్న నీటి వనరులు, స్థానిక వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. నీటి పొదుపు పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలని కోరారు. యాసంగి సాగులో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడం, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను నివారించడం ప్రధాన లక్ష్యాలుగా రైతులు ముందుకు సాగాలని వ్యవసాయ అధికారి సూచించారు. పంటల ఎంపిక విషయంలో సందేహాలు ఉన్న రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు గిరి లింగస్వామి, నారపాక వసంత ధనయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచ్లు పాలకవర్గం, ఇతర గ్రామస్థాయి అధికారులు, గ్రామాల రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.