📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటు కోల్పోయినోళ్లకు మరో అవకాశం

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటు కోల్పోయినోళ్లకు మరో అవకాశం

📰 Generate e-Paper Clip

*ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటు కోల్పోయినోళ్లకు మరో అవకాశం…*

*అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.*

*జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 07*

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా గైర్హాజరు , చిరు నామాలో అందుబాటులో లేకపోవడం , మరణం , డూప్లికేట్ (ఎఎస్ డిడి) తదితర కారణాలతో ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారికి భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం ప్రకారం అర్హులైన ఓటర్లు తమ పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చు కునేందుకు సంబంధిత ఎన్యూమరేషన్ ఫారంతో పాటు అవసరమైన స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. ఇందుకోసం గతంలో తప్పనిసరిగా సూచించిన ఫారం-6 సమర్పించాలనే నిబంధనను ఎన్నికల సంఘం సడలించింది.
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఓటర్లు తమ ప్రాంతానికి సంబంధించిన బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ , ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ను సంప్రదించి అవసరమైన వివరాలు , పత్రాలు సమర్పించాలి. ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారు మళ్లీ సమర్పించాల్సిన అవ సరం లేదు. చిరునామా మారిన ఓటర్లు కొత్త చిరునామాకు సంబంధించిన వివరాలను , అసెంబ్లీ నియోజకవర్గ సమాచారాన్ని జత చేయాలి. ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల సంఘం వెబ్‌సైట్ యాప్ ద్వారా కూడా అవసర మైన ఫారాలను పొందే అవకాశం కల్పించారు.
కావున ఓటర్ల జాబితాలో పేరు కోల్పోయిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకొని , అవసరమైన పత్రాలను సంబంధిత అధికారులకు అందజేసి తమ ఓటు హక్కును తిరిగి పొందాలని కోరడమైనది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలు వైనది. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా ఈ అవకాశంను వినియో గిచ్చుకోవాల్సిందిగా తెలియజేయనైనది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.