రావిరాలలో విసిపిసి కమిటీ ఏర్పాటు
ప్రజావాణి,నెల్లికుదురు:అన్నారు.మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో శనివారం ఐసిడిఎస్ నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ ఎన్.సరిత ఆధ్వర్యంలో స్థానిక యుపిఎస్ లో విసిపిసి కమిటీని ఏర్పాటు చేశారు.
కమిటీ చైర్మన్ గా సర్పంచి కళ్యాణి యాకాంతం,కన్వీనర్ గా అంగన్వాడీ టీచర్ కరుణ తో పాటు మరో 15 మందిని సభ్యులుగా నియమించారు. దీనికి స్థానిక సర్పంచి కత్తుల కళ్యాణి యాకాంతం హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని గర్భిణిలు,బాలింతలు,పిల్లలు,కిషోర బాలికలకు సూచించారు.
1098కు ఫోన్ చేయాలి: సూపర్వైజర్ సరిత
బాలికలకు చిన్నారులకు ఇతరుల నుంచి ఇబ్బంది ఏర్పడితే 1098 మొబైల్ నెంబర్ కు ఫోన్ చేయాలని సూపర్వైజర్ ఎన్ సరిత సూచించారు.పిల్లలపై జరిగే నేరాలనియంత్రణ,బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణ,శారీరక మానసిక వేధింపుల నుంచి సంరక్షించడానికి పిల్లలకు,తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి విసిపిసి కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం గాయపులింగారెడ్డి,అంగన్వాడి టీచర్స్ కరుణ, సుభద్ర,ఆశా వర్కర్ రాణి పాఠశాల ఉపాధ్యాయులు, గర్భిణీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

