ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
పోచారం గ్రామంలో రైతు సంఘం జెండా
కూసుమంచి నవంబర్ 6 (మన ప్రజావాణి) ప్రతినిధి RK
: నవంబర్ 15, 16, 17, 18 తేదీల్లో నిర్వహించనున్న ఏఐకేఎస్ (AIKS) జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మహాసభల విజయవంతానికి చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా కూసుమంచి మండలం పోచారం గ్రామంలో రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సన్మత్ రావు, మండల కార్యదర్శి గంగాధర్, మండల నాయకులు అబ్బులు మాట్లాడుతూ జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు. రైతుల సమస్యలు, హక్కుల సాధన కోసం రైతు సంఘం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు రెడ్డి మల్ల వెంకటయ్య, ఇరుగు రంగ,శివ కోటి ఆచారి, రాకేష్, ఇరుగు వెంకన్న, పాలపాటి ఉపేందర్, ఆత్మకూరు సురేష్, ఆవుల వెంకటేష్, సల్వాది రమేష్ తదితరులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

