*ప్రతి ఇంట ఆనంద దీపాలు వెలగాలి: మాసుల శ్రీనివాస్….*
దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్….
ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం
చేగుంట మండల ప్రజలందరికి చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఆకాంక్షించారు.చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయమన్నారు.సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం, కేదారీశ్వర వ్రతాలు చేయడం కూడా దీపావళి పండగ విశిష్టత అని చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అన్నారు.ప్రజలందరు పండుగను సంతోషంగా జరుపుకోవాలని,పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకొవాలని చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ సూచించారు.

