మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి. నవంబర్ 7: (మనప్రజావాణి ప్రతినిధి)
రూ. 11 కోట్ల 59 లక్షల రూపాయలతో మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో నూతనంగా చేపట్టబోయే పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ
మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్ సి ఐ కాలనీ ,విడియో కాలనీ,ప్రగతి ఎన్ క్లేవ్ ,సత్య లక్ష్మీ నగర్, అరబిందో కాలనీ,జయప్రకాష్ నారాయణ్ నగర్, అల్లూరి సీతారామరాజు నగర్, నాగార్జున ,VSP , శ్రీదేవి ఎన్ క్లేవ్, నాగార్జున ఎన్ క్లేవ్, మేఘన ఎన్ క్లేవ్,ప్రశాంత్ నగర్,కృష్ణ సాయి ఎన్ క్లేవ్,HMT స్వర్ణ పూరి కాలనీలలో రూ. 11 కోట్ల 59 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాల్వ నిర్మాణం ,పార్క్ అభివృధి నిర్మాణం పనులకు , స్మశాన వాటిక అభివృద్ది నిర్మాణం పనులకు తాజా మాజీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పీఏసీ చైర్మన్
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్ సి ఐ కాలనీ ,విడియో కాలనీ,ప్రగతి ఎన్ క్లేవ్ ,సత్య లక్ష్మీ నగర్, అరబిందో కాలనీ,జయప్రకాష్ నారాయణ్ నగర్, అల్లూరి సీతారామరాజు నగర్, నాగార్జున ,VSP , శ్రీదేవి ఎన్ క్లేవ్, నాగార్జున ఎన్ క్లేవ్, మేఘన ఎన్ క్లేవ్,ప్రశాంత్ నగర్,కృష్ణ సాయి ఎన్ క్లేవ్,HMT స్వర్ణ పూరి కాలనీలలో రూ. 11 కోట్ల 59 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాల్వ నిర్మాణం ,పార్క్ అభివృధి నిర్మాణం పనులకు , స్మశాన వాటిక అభివృద్ది నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, సీసీ రోడ్ల పనులు మరియు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీల వాసులకు నేటితో ఉపశమనం లభించింది అని గారు తెలిపారు
ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రివర్యులు
శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని , శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అగ్రభాగాన నిలబెడుతామని పిఎసి చైర్మన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళా సోదరీమణులు , కాలనీల అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


