📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ ఖాతా తెరిచింది.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ ఖాతా తెరిచింది.

📰 Generate e-Paper Clip

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ ఖాతా తెరిచింది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించారు.

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 6
చీరాల బాపట్ల జిల్లా

తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు ఈ రోజు శుక్రవారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ మరి కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చింది. అక్కడి కాంగ్రెస్ నేత ఎఫెక్ట్ తోనే ఈ ఫలితం వచ్చింది. కాగా.. అక్కడ వైసీపీకి మూడో స్థానంకు పరిమితం కావటంతో ఆసక్తిగా మారింది.

చీరాల మున్సిపల్ ఓట్ల లెక్కింపు ఈ రోజు జరుగుతోంది. మురుసు తుఫాను కారణంగా ఈ నెల 3న జరగాల్సిన లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. చీరాల మున్సిపాలిటీలోని 44 వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు.

ఈ ఎన్నికల బరిలో మొత్తం 163 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ ఛైర్మన్ అభ్యర్దికి మెజార్టీ వచ్చింది. టీడీపీకి 40, వైసీపీకి 37, కాంగ్రెస్ కు 11 ఓట్లు పోలయ్యాయి. కాగా వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో ఆసక్తి కర ఫలితాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పోరు కూటమి- వైసీపీ మధ్య ప్రతిష్ఠాత్మకంగా మారింది. కూటమి ఏకపక్షంగా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. కాగా.. ఇప్పుడు చీరాలలో కాంగ్రెస్ తొలి విజయం నమోదు చేసుకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.