📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో అణచివేస్తారా?

ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో అణచివేస్తారా?

📰 Generate e-Paper Clip

ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో అణచివేస్తారా?

– దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం

– ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారా?

– కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌పై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా?

– తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోంది

– ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా?

– దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 07(ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల మాంసాభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజే శ్వర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన లో తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో సహా నిలదీస్తున్నందుకే బాలరాజు యాదవ్‌పై అక్రమ కేసులు బనా యించి అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆయన పేర్కొన్నారు.

ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో నిర్బంధాలు, అణిచి వేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేస్తూ అరెస్టులకు పాల్పడటం నిరంకుశ పాలనకు నిదర్శనం. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌పై చేస్తున్న ఆరోపణలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ, వాటిని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడు తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణలో రాజ్యాంగ హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసా గుతుంటే రాహుల్ గాంధీకి కనిపించడం లేదా? ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రశ్నించే వారిని అరెస్టు చేయడమేనా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ఆ హక్కును కాలరాస్తూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సరికా దు. దూదిమెట్ల బాలరాజు యాదవ్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి, ఆయనను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.