పోరుమామిళ్ల (కడప జిల్లా)నవంబర్ 05ప్రజావాణి: మండల పరిధిలోని దమనపల్లి పంచాయతీకి చెందిన సుంకేసుల గ్రామంలో గురువారం (ఈరోజు) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న సందర్భంగా ఓటర్ల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉచిత హెల్త్ క్యాంప్ (వైద్య శిబిరం) విజయవంతంగా ముగిసింది.పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు,ముఖ్యంగా వృద్ధులు,మహిళలు ఎండ తీవ్రతకు లేదా క్యూ లైన్లలో నిలబడి అనారోగ్యానికి గురికాకుండా వైద్య ఆరోగ్య శాఖ ముందస్తుగా ఈ భద్రతా చర్యలు చేపట్టింది.వైద్యుల పర్యవేక్షణలో ముమ్మర సేవలు ఈ హెల్త్ క్యాంప్‌నకు పోరుమామిళ్ల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తలారి శ్రీవిద్య ముఖ్య నిర్వాహకులుగా వ్యవహరించి, స్వయంగా రోగులను పరీక్షించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూస్తూనే,మరోపక్క ప్రజల ఆరోగ్య బాధ్యతను వైద్య బృందం భుజానికెత్తుకుంది.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్‌తో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సిహెచ్ఓ) ఐశ్వర్య దుర్గ, స్థానిక ఏఎన్ఎంలు, మరియు ఆశా,కార్యకర్తలు పాల్గొని రోగులకు సేవలు అందించారు.శిబిరంలో అందించిన ఉచిత సేవలు:ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు: పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లకు రక్తపోటు (బి.పి)మధుమేహం (షుగర్) పరీక్షలతో పాటు సాధారణ తనిఖీలు చేశారు.ఉచిత మందుల పంపిణీ: నీరసించిపోయే ఓటర్ల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.జ్వరం,ఒళ్లు నొప్పులు, దగ్గు,గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించిన అత్యవసర మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి అనుసరించాల్సిన నియమాలను డాక్టర్ శ్రీవిద్య, సిహెచ్ఓ ఐశ్వర్య దుర్గ ప్రజలకు వివరించారు.ఎన్నికల పోలింగ్ రోజైనప్పటికీ, ఏమాత్రం అలసత్వం వహించకుండా గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉచిత వైద్య సహాయం అందించడంపై సుంకేసులపల్లె గ్రామస్థులు, ఓటర్లు హర్షం వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి వచ్చి అనారోగ్యానికి గురైన పలువురు వృద్ధులకు ఈ క్యాంప్ తక్షణ ఊరటనిచ్చింది. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఓటర్లకు భరోసా కల్పించిన డాక్టర్ తలారి శ్రీవిద్య, సిహెచ్ఓస్ ఐశ్వర్య, దుర్గ, మరియు హెల్త్ స్టాఫ్‌ను స్థానిక ప్రజలు, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
పోలింగ్ కేంద్రం వద్ద వైద్య భరోసా: సుంకేసుల గ్రామ ఓటర్ల కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం, డాక్టర్ తలారి శ్రీవిద్య
RELATED ARTICLES

