పోలింగ్ కేంద్రం వద్ద వైద్య భరోసా: సుంకేసుల గ్రామ ఓటర్ల కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం, డాక్టర్ తలారి శ్రీవిద్య

పోరుమామిళ్ల (కడప జిల్లా)నవంబర్ 05ప్రజావాణి: మండల పరిధిలోని దమనపల్లి పంచాయతీకి చెందిన సుంకేసుల గ్రామంలో గురువారం (ఈరోజు) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న సందర్భంగా ఓటర్ల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉచిత హెల్త్ క్యాంప్ (వైద్య శిబిరం) విజయవంతంగా ముగిసింది.పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు,ముఖ్యంగా వృద్ధులు,మహిళలు ఎండ తీవ్రతకు లేదా క్యూ లైన్లలో నిలబడి అనారోగ్యానికి గురికాకుండా వైద్య ఆరోగ్య శాఖ ముందస్తుగా ఈ భద్రతా చర్యలు చేపట్టింది.వైద్యుల పర్యవేక్షణలో ముమ్మర సేవలు ఈ హెల్త్ క్యాంప్‌నకు పోరుమామిళ్ల మెడికల్ ఆఫీసర్...