📄 ePaper
Epaper 2
Friday, November 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యార్థుల భద్రతే లక్ష్యం.. బాలల హక్కులపై అవగాహన

విద్యార్థుల భద్రతే లక్ష్యం.. బాలల హక్కులపై అవగాహన

📰 Generate e-Paper Clip

విద్యార్థుల భద్రతే లక్ష్యం.. బాలల హక్కులపై అవగాహన

• సెయింట్ డాన్ బాస్కో పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం

మన ప్రజావాణి | నవంబర్ 05 | జోగిపేట | జిల్లా ప్రతినిధి

విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రహదారి భద్రత, సైబర్ నేరాలు, క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు జోగిపేటలోని సెయింట్ డాన్ బాస్కో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జోగిపేట ఎస్ఐ గిరి శ్రీకాంత్ తన పోలీసు బృందంతో హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల అడ్మినిస్ట్రేటర్ రెవ. ఫాదర్ ఎన్. సురేష్ పోలీసు బృందానికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎస్ఐ గిరి శ్రీకాంత్ మాట్లాడుతూ.. బాలల హక్కులు, పోక్సో చట్టం, బాలలపై జరిగే లైంగిక నేరాల నుంచి రక్షణ, వ్యక్తిగత భద్రత, అనుచిత ప్రవర్తనను గుర్తించడం, ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందే విధానాలను వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలను తెలియజేస్తూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరించారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటం, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు.

విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దల పట్ల గౌరవభావంతో మెలగాలని, క్రమశిక్షణ, సమయపాలన, మంచి అలవాట్లు అలవర్చుకోవాలని హితవు పలికారు.

అనంతరం పాఠశాల అడ్మినిస్ట్రేటర్ రెవ. ఫాదర్ ఎన్. సురేష్ మాట్లాడుతూ.. విద్య అనేది కేవలం పుస్తకాలు, పరీక్షలు, మార్కులకే పరిమితం కాకూడదని, విద్యార్థులను సామాజిక బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కూడా విద్యాసంస్థల బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రెవ. ఫాదర్ సిబి, అడ్మినిస్ట్రేటర్ రెవ. ఫాదర్ ఎన్. సురేష్, ప్రిన్సిపాల్ శ్రీమతి జిన్సీ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు విలువైన సూచనలు అందించిన ఎస్ఐ గిరి శ్రీకాంత్, పోలీసు బృందానికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.