📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజమ్మికుంటలో గోమాతపై ప్రవచనాలుఆచరణలో మాత్రం శూన్యమా

జమ్మికుంటలో గోమాతపై ప్రవచనాలుఆచరణలో మాత్రం శూన్యమా

📰 Generate e-Paper Clip

జమ్మికుంటలో గోమాతపై ప్రవచనాలుఆచరణలో మాత్రం శూన్యమా

* చాగంటి ప్రవచనాలు ఒకవైపుమీడియా ప్రతినిధుల అవమానం మరోవైపు

* గోమాత రక్షణ చేతకాని వారికి గోమాత గొప్పతనంపై ప్రవచనాలెందుకు

* రోడ్లపై గోవుల అవస్థలు కనిపించవా గోశాల ఏర్పాటు చేసే దమ్ముందా

* అన్నపూర్ణ సేవా సమితి నిర్వాహకుల తీరుపై తీవ్ర విమర్శలు

* మీడియా ప్రతినిధులకు అవమానం

జమ్మికుంట నవంబర్ 4 (ప్రజావాణి)

గోమాతను పూజించాలి గోవులను రక్షించాలిగోసేవే మహాభాగ్యంఅంటూ గంటల తరబడి ప్రవచనాలు చేయించడం చాలా గొప్ప విషయమే కానీ ఆ ప్రవచనాలు నిర్వహించిన జమ్మికుంటలో గోమాతల పరిస్థితి ఏమిటి? పట్టణంలోని ప్రధాన రహదారులపై గోవులు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. గోమాతకు రక్షణ కల్పించలేని పట్టణంలో గోమాత గొప్పతనంపై భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం దేనికి సంకేతం మాటల్లో గోమాతకు పూజలు చేతల్లో గోమాతకు రక్షణ లేకపోవడం ఏ రకమైన ధర్మం ఇదే ఇప్పుడు జమ్మికుంట ప్రజల్లోవినిపిస్తున్ననిలదీతఇటీవల జమ్మికుంట పట్టణంలోని బొమ్మలగుడి ఆవరణలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గోమాత గొప్పతనాన్ని, హిందూ ధర్మంలో గోవుకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. అయితే ప్రవచనాలు నిర్వహించిన నిర్వాహకులు ఒక్కసారి తమ చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలించారా జమ్మికుంటలో గోమాతల కోసం ప్రత్యేక గోశాల ఉందా ఉంటే ఎక్కడ ఉంది ఎంతమంది గోవులకు ఆశ్రయం కల్పిస్తున్నారు అనారోగ్యంతో ఉన్న గోవులకు వైద్యం అందిస్తున్నారా రోడ్లపై తిరుగుతున్న గోవులను సంరక్షించేందుకు ఏమైనా కార్యాచరణ రూపొందించారా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నిర్వాహకులపై లేదాగోమాతపై ప్రేమ మాటల్లోనా చేతల్లో చూపించరాగోమాతను దేవతగా భావించే వారు ముందుగా ఆ గోమాతకు తిండి, నీరు, నీడ, వైద్యం, సురక్షితమైన ఆశ్రయం కల్పించాలి. కానీ జమ్మికుంటలో రోడ్లపై తిరుగుతున్న గోవుల పరిస్థితి చూస్తే గోరక్షణపై ఎంతటి శ్రద్ధ ఉందో అర్థమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు, రాత్రివేళ ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. మూగజీవాలు రోడ్లపై ప్రమాదాలకు గురవుతున్నాయి ఇలాంటి సమస్యలను పరిష్కరించకుండా గోమాతపై ప్రవచనాలు నిర్వహిస్తే ప్రయోజనం ఏమిటిగోమాతపై నిజమైన భక్తి ఉంటే ముందుగా గోశాల నిర్మించండి. గోవుల సంరక్షణకు నిధులు కేటాయించండి. వాటి కోసం సేవా కార్యక్రమాలు చేపట్టండి చేతనైతే గోమాతకు ఆశ్రయం కల్పించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అంతేగానీ వేదికలపై గోమాత గొప్పతనం చెప్పి, బయట గోవుల అవస్థలను పట్టించుకోకపోతే ఆధ్యాత్మికతకు అర్థం ఏముంటుందిఅన్నపూర్ణ సేవా సమితి అంటే కొందరి మిత్రబృందంకోసమేనాఅన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఆ కార్యక్రమాల నిర్వహణలో పారదర్శకత ఎక్కడ నిర్వాహకులు ఎవరు బాధ్యతలు ఎవరికి అప్పగించారుఏ విధివిధానాల ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల కోసం నిర్వహించే కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎంత కార్యక్రమం నిర్వహణలో కొందరి మిత్రబృందానికే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలకు నిర్వాహకులు సమాధానం చెప్పాలిఆధ్యాత్మిక కార్యక్రమం అంటే కొందరు వ్యక్తుల ఆధిపత్యం ప్రదర్శించుకునే వేదిక కాదు. ప్రజలందరికీ సమాన గౌరవం కల్పించే వేదిక కావాలి. ఆహ్వానించిన వారిని గౌరవించడం నిర్వాహకుల కనీస బాధ్యత. కార్యక్రమానికి ప్రజలను పిలిచి, ఆ తర్వాత వారి గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే అలాంటి నిర్వహణను ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలిచాగంటి ప్రవచనాలు ఒకవైపుమీడియా ప్రతినిధుల అవమానం మరోవైపుఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధుల పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారితీస్తోంది విలేకరులను ఆహ్వానించి కార్యక్రమానికి వచ్చిన తర్వాత చాగంటి కోటేశ్వరరావు మిత్రబృందం, వ్యక్తిగత సిబ్బంది ఫోటోగ్రాఫర్ ద్వారా కించపరిచేలా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై నిర్వాహకులు సమాధానం చెప్పాలిప్రవచనాల్లో చిన్నా పెద్దా అనే తేడా చూడకూడదని, ప్రతి ఒక్కరినీ గౌరవించాలని బోధించే సమయంలో అదే వేదికపై మీడియా ప్రతినిధులకు కనీస గౌరవం కల్పించకపోవడం ఎంతవరకు సమంజసం విలేకరులు ఎవరి దగ్గరైనా వ్యక్తిగత గౌరవం అడుక్కోవడానికి వెళ్లారా ప్రజల కోసం వార్తలు రాసే మీడియా ప్రతినిధులను అవమానించే హక్కు ఎవరిచ్చారుచాగంటి ప్రవచనాలు వినడానికి వచ్చిన వారిలో మీడియా ప్రతినిధులు కూడా ప్రజల తరఫున పనిచేసే వారే. వారిని చిన్నచూపు చూడటం ఏ సంస్కృతికి నిదర్శనం ఆధ్యాత్మికత అంటే వినయం సంస్కారం, సమానత్వం అని చెప్పే పెద్దలు తమ కార్యక్రమాల నిర్వహణలోనూ అదే విలువలను పాటించాల్సిన అవసరం లేదాగోరక్షణ పేరుతో కార్యక్రమాలాగోరక్షణ కోసం కార్యాచరణ ఏదీజమ్మికుంటలో గోమాతల సంరక్షణ కోసం అన్నపూర్ణ సేవా సమితి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలేమిటిగోశాల ఏర్పాటు చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారు గోవుల సంరక్షణ కోసం ఎంత నిధులు ఖర్చు చేశారు రోడ్లపై తిరుగుతున్న గోవుల సమస్యపై మున్సిపల్ అధికారులతో ఎప్పుడైనా చర్చించారా గోమాతల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారా ఈ వివరాలను ప్రజల ముందు పెట్టగలరాఒకవేళ గోమాతపై అంతటి భక్తి, ప్రేమ ఉంటే జమ్మికుంటలోనే ఒక ఆదర్శ గోశాలను ఏర్పాటు చేసి చూపించండి. మీ ప్రవచనాల స్ఫూర్తిని చేతల్లో చూపించండి. ప్రజల నుంచి అభినందనలు పొందండి. అంతేగానీ ఇతరులకు ధర్మం గురించి బోధిస్తూ, స్థానిక సమస్యలను విస్మరిస్తే ప్రజలు ప్రశ్నించకుండా ఉంటారాప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో భారీ ఏర్పాట్లు చేయడం, ప్రముఖులను ఆహ్వానించడం, ప్రచార ఆర్భాటాలు చేయడం కంటే ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముఖ్యం. గోమాతకు రక్షణ లేని పట్టణంలో గోమాత గొప్పతనంపై ప్రవచనాలు నిర్వహించడం కంటే ముందుగా గోవులకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాలి మీడియా ప్రతినిధులను గౌరవించలేని నిర్వాహకులు సమాజానికి ఏ విలువలు నేర్పించబోతున్నారుచాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలపై ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ ప్రవచనాల పేరుతో కార్యక్రమాలు నిర్వహించే వారు చెప్పే ధర్మాన్ని తమ ఆచరణలో చూపించాలి. నిర్వాహకుల బాధ్యత, పారదర్శకత, ప్రజల పట్ల గౌరవం కూడా అంతే ముఖ్యంచివరిగా జమ్మికుంట ప్రజల సూటి ప్రశ్నలు ఇవే1. జమ్మికుంటలో గోమాతల కోసం ప్రత్యేక గోశాల ఎక్కడ ఉంది2. రోడ్లపై తిరుగుతున్న గోవుల సంరక్షణ బాధ్యత ఎవరిది3. గోమాత రక్షణ కోసం అన్నపూర్ణ సేవా సమితి ఇప్పటివరకు ఏం చేసింది4. కార్యక్రమ నిర్వహణలో అనుసరించిన విధివిధానాలు ఏమిటి5. ఆహ్వానించిన మీడియా ప్రతినిధులను అవమానించే పరిస్థితి ఎందుకు వచ్చింది6. సేవా సమితి నిర్వహణలో పారదర్శకత ఉందా ప్రజలకు వివరాలువెల్లడిస్తారాగుర్తుంచుకోండి గోమాతపై ప్రవచనం చేయడం గొప్ప కాదు గోమాతకు ఆశ్రయం కల్పించడం గొప్ప ధర్మం గురించి మాట్లాడటం గొప్ప కాదు ధర్మాన్ని ఆచరించడం గొప్ప వేదికలపై నీతులు చెప్పడం కాదు.. ప్రజల మధ్య నీతిగా వ్యవహరించడమే నిజమైన ఆధ్యాత్మికతజమ్మికుంటలో గోమాతకు రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో గోమాతపై ప్రవచనాల ఆర్భాటం ఎందుకన్న ప్రశ్నకు అన్నపూర్ణ సేవా సమితి నిర్వాహకులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.