📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమురసు తుఫాను ప్రభావంతో అశ్వరావుపేట భద్రాచలం రాకపోకలకు అంతరాయం

మురసు తుఫాను ప్రభావంతో అశ్వరావుపేట భద్రాచలం రాకపోకలకు అంతరాయం

📰 Generate e-Paper Clip

*మురసు తుఫాను ప్రభావంతో అశ్వరావుపేట భద్రాచలం రాకపోకలకు అంతరాయం*

భారీ వర్షం కారణంతో అశ్వరావుపేట అంకమ్మ తల్లి చెరువు అలుగు పొంగడంతో భద్రాచలం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు బంద్.

ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ డిడిఆర్ఎఫ్ అందాలు అందుబాటులో ఉన్నారని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

వాతావరణం అనుకూలించితే రేపు ఉదయం 10 గంటలకు రాకపోకలు కొనసాగుతాయని చెప్పారు.
అశ్వరావుపేటలో నిలిచిపోయిన భద్రాచలం మార్గం – కిలోమీటర్ల మేర వాహనాల జామ్!

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 4

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో భారీగా చేరుకున్న వరద నీటితో అంకమ్మ తల్లి చెరువు నిండి అలుగు పారుతోంది. చెరువు అలుగు నీరు రహదారిపైకి ఉధృతంగా చేరడంతో అశ్వరావుపేట – భద్రాచలం ప్రధాన రహదారిపై రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీనితో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు, భారీ లారీలు, ప్రైవేటు వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పరిస్థితిని సమీక్షించిన పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నీటి ఉధృతిని పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులు నీటి ప్రవాహం తగ్గేవరకు ఈ మార్గంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.