📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅవినీతి తిమింగలం సస్పెన్షన్:

అవినీతి తిమింగలం సస్పెన్షన్:

📰 Generate e-Paper Clip

*అవినీతి తిమింగలం సస్పెన్షన్:

ముదిరాజ్ సమాజంలో వెల్లువెత్తిన ఆనందం

-నకిలీ జీవోలు, బోగస్ సభ్యత్వాల దందాకు అడ్డుకట్ట వేసిన ప్రభుత్వం.

-పేద మత్స్యకారుల పొట్టకొట్టిన అవినీతి అధికారిపై ముదిరాజ్ సంఘం తీవ్ర ఆగ్రహం..

జిల్లాలో సమగ్ర విచారణ కొనసాగించి చర్యలు తీసుకోవాలి

ముదిరాజ్ సంఘం నేతల డిమాండ్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

మత్స్యశాఖలో సుదీర్ఘకాలంగా తిష్టవేసి, అధికార బలంతో పేద మత్స్యకారుల రక్తాన్ని పిండిన అవినీతి అధికారి ఆంజనేయ స్వామి పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడం పట్ల రాష్ట్ర, జిల్లా ముదిరాజ్ సంఘం తీవ్ర హర్షం వ్యక్తం చేసింది.. అవినీతి అధికారి సస్పెండ్ అయిన వార్త తెలియగానే రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ కులస్థులు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకుని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.. తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చోప్పరి శంకర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అత్యవసర విలేకరుల సమావేశంలో ముదిరాజ్ కుల పెద్దలు, సంఘం ప్రతినిధులు ఒకేతాటిపై కూర్చొని అవినీతి అధికారి అక్రమాల సామ్రాజ్యాన్ని ఎండగట్టారు..

*లంచాల పిశాచి.. నకిలీల సూత్రధారి..*

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ… సస్పెండ్ అయిన అధికారి ఒక లంచాల పిశాచిలా ప్రవర్తించాడని మండిపడ్డారు.. కేవలం కోమట్లగూడెం సొసైటీకే పరిమితం కాకుండా, జిల్లా వ్యాప్తంగా వందలాది నకిలీ సభ్యత్వాలను సృష్టించి సాంప్రదాయక వృత్తి నైపుణ్యం లేని అనర్హులకు చెరువులను కట్టబెట్టాడని ధ్వజమెత్తారు.. ఏకంగా ప్రభుత్వ ఉన్నత ఉత్తర్వులను (జీఓస్) సైతం ఫోర్జరీ చేసి, బోగస్ ప్రొసీడింగ్స్ తయారు చేసిన ఇలాంటి ఘోరమైన అవినీతి అధికారి వల్ల ఎంతోమంది నిజమైన ముదిరాజ్ బిడ్డలు ఆకలితో అలమటించారని, సొసైటీల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు పాపం పండి ఈ అవినీతి తిమింగలం ఇంటికి చేరిందని వారు ఎద్దేవా చేశారు.

*ఆలస్యంగా నైనా స్పందించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి అధికారులు…?

పేద మత్స్యకారుల ఆవేదనను, తాము అందించిన ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే స్పందించిన ప్రభుత్వంపై ముదిరాజ్ కులస్థులు ప్రశంసల వర్షం కురిపించారు.. అక్రమార్కుడిని ఉపేక్షించకుండా, సస్పెన్షన్ వేటు వేసి ప్రభుత్వం తన నిజాయితీని, ప్రజాపక్షపాత వైఖరిని చాటుకుందని కొనియాడారు.. “శ్రమ నమ్ముకున్న ముదిరాజ్ బిడ్డలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ నిర్ణయంతో రుజువైంది” అని హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి సాహసోపేతమైన, న్యాయమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కి, మత్స్యశాఖ మంత్రి ఖమ్మం ఇన్చార్జి వాకటి శ్రీహరి కి, ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, విచారణను వేగవంతం చేసిన ఆ శాఖ ఉన్నతాధికారులకు, (కమిషనర్ కి) ముదిరాజ్ సమాజం తరపున శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు..
సస్పెన్షన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, అవినీతి అధికారి జిల్లా అంతటా సృష్టించిన అన్ని నకిలీ జీవోలను, బోగస్ సభ్యత్వాలను తక్షణమే రద్దు చేసి స్క్రీనింగ్ కమిటీ ద్వారా నిజమైన మత్స్యకారులకే చెరువులపై పూర్తి హక్కులు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసినందుకు అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, అక్రమ ఆస్తులను జప్తు చేయాలని కోరారు. పేదల పొట్టకొట్టే అధికారులకు ఈ సస్పెన్షన్ ఒక బలమైన హెచ్చరిక కావాలని ముదిరాజ్ సంఘం స్పష్టం చేసింది. కాగా ఖమ్మం జిల్లాలో మెజార్టీ చెరువులు కాంట్రాక్టర్ల గుప్పెట్లో బందీగా మారిన వ్యవహారంపై కూడా ప్రజా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని నిజమైన మత్స్యకారులకు హక్కులు కల్పించి బోగస్ సభ్యులను తొలగించాలని మరో ఇద్దరు అధికారులు కూడా జిల్లాలో లెక్కలేని అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ విలేకరుల సమావేశంలో మన ముదిరాజు మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోప్పెర వెంకట నరసయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులు ప్రతానపు వెంకటేశ్వర్లు ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు కొప్పెర జానకి రాములు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కొమ్ము భాస్కర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు, మత్స్యశాఖ కన్వీనర్ బొమ్మకంటి సైదులు ముదిరాజ్, ఉపాధ్యక్షులు చింతనబోయిన సీతారాములు ముదిరాజ్, దంతాల కేశవులు ముదిరాజ్, గొడుగు నాగేశ్వరరావు ముదిరాజ్, బండారి శ్రీను ముదిరాజ్, కోశాధికారి ఓర వెంకటేశ్వర్లు ముదిరాజ్, కార్యదర్శులు పందుల ఉపేందర్ ముదిరాజ్, చామకూరి నాగేశ్వరరావు ముదిరాజ్, గోగుల శ్రీను ముదిరాజ్, నర్ల శేషయ్య ముదిరాజ్, కోమట్లగూడెం మత్స్యపారిశ్రామిక సంఘం అధ్యక్షుడు పిట్టల వెంకటేశ్వర్లు ముదిరాజ్, జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు బుడిగె వెంకటేశ్వర్లు ముదిరాజ్, అడపా ప్రవీణ్ ముదిరాజ్, వివిధ మండలాల ప్రతినిధులు, బాధిత మత్స్యకార సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.